గురువారం 04 జూన్ 2020
Telangana - May 14, 2020 , 01:17:09

ఏ అవసరానికైనా డయల్‌ 100

ఏ అవసరానికైనా డయల్‌ 100

  • ఒంటరి వృద్ధులకు పోలీసు సేవలు: డీజీపీ  

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఒంటరిగా జీవిస్తున్న 60 ఏండ్ల పైబడినవారు ఏ అవసరం ఉన్నా డయల్‌ 100కు సమాచారమిస్తే పోలీసులు వచ్చి సాయంచేస్తారని డీజీపీ మహేందర్‌రెడ్డి భరోసా కల్పించారు. 60 ఏండ్లపైబడినవారికి కరోనా సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్నందున వారంతా ఇండ్లకే పరిమితం కావాలని, ఏ అవసరం వచ్చినా 100 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని బుధవారం ట్విట్టర్‌లో కోరారు. మరోవైపు, విధుల్లో ఉన్న ఓ పోలీస్‌ అధికారికి ఒక బాలుడు రెండు చేతులెత్తి నమస్కరిస్తున్న ఫొటోను ఆయన ట్విట్టర్‌లో షేర్‌చేశారు. పోలీసులు కొవిడ్‌-19 మహమ్మారితో యుద్ధం చేస్తున్నారని తల్లిదండ్రులు చెప్పిన మాటలే ఆ చిన్నారిని.. పోలీసులకు నమస్కరించేలా చేసి ఉంటాయని వ్యాఖ్యానించారు.


logo