సోమవారం 25 జనవరి 2021
Telangana - Oct 30, 2020 , 15:44:36

2 కిలోల గంజాయి పట్టివేత

2 కిలోల గంజాయి పట్టివేత

హైదరాబాద్‌ :  హైద‌రాబాద్ న‌గ‌రం న‌డిబొడ్డున మ‌రోసారి గంజాయి పట్టుబడింది. ఖైరతాబాద్‌లోని ఓ హోటల్‌లో గంజాయి సేవిస్తున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని వారి నుంచి 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.  నిందితులు ఎక్కువగా విద్యార్థులకు గంజాయి విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. పట్టుబడిన వారు కళాశాల విద్యార్థులని తెలుస్తోంది. గంజాయి అక్రమ రవాణా అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. గడిచిన కొన్నినెలలుగా పోలీసులు నిఘా పెంచడంతో భారీగా గంజాయి పట్టుబడుతోంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo