సోమవారం 25 జనవరి 2021
Telangana - Jan 28, 2020 , 22:03:19

కల్లులో కలిపే క్లోరల్‌ హైడ్రేట్‌ పట్టివేత

కల్లులో కలిపే క్లోరల్‌ హైడ్రేట్‌ పట్టివేత

నల్లగొండ  : కల్లులో కలిపే క్లోరల్‌ హైడ్రేట్‌తో పాటు పలు రసాయనాలను  నల్లగొండ జిల్లా ఎక్సైజ్‌ పోలీసులు పట్టుకున్నారు. ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ శంకరయ్య తెలిపిన వివరాలు.. ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పోలీసుల ఆధ్వర్యంలో మంగళవారం నార్కట్‌పల్లి, నకిరేకల్‌లోని పలువురి ఇండ్లపై దాడులు నిర్వహించారు. నార్కట్‌పల్లిలోని వేముల నర్సింహగౌడ్‌, ఎల్లయ్యగౌడ్‌ల ఇంట్లో కల్లులో కలిపే 310 కేజీల క్లోరల్‌ హైడ్రేడ్‌, 3 కేజీల చక్రిన్‌, ఒక కేజి అనుమానిత డ్రగ్స్‌ పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. నకిరేకల్‌లో వేముల నర్సింహ, శ్రీకాంత్‌, మజీద్‌ల ఇళ్లపై దాడి చేసి 300 కేజీల క్లోరల్‌ హైడేడ్‌, కిలో డైజీ ఫామ్‌ స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసినట్లు సూపరింటిండెంట్‌ తెలిపారు. దాడుల్లో ఏఈఎస్‌ భరత్‌ భూషన్‌, సీఐలు రాగవీణ, నాగార్జునరెడ్డి, వెంకటరెడ్డి, స్వామి, శ్రీను, అయూబ్‌, శేఖర్‌రెడ్డి, నాగరాజు, రమేష్‌, పాల్గొన్నారు. 


logo