శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Telangana - Jul 23, 2020 , 20:18:33

రూ. 80 వేల విలువైన పొగాకు ఉత్ప‌త్తుల ప‌ట్టివేత‌

రూ. 80 వేల విలువైన పొగాకు ఉత్ప‌త్తుల ప‌ట్టివేత‌

సిద్దిపేట : రూ. 80 వేల విలువైన పొగాకు ఉత్ప‌త్తుల‌ను సిద్దిపేట టూ టౌన్ పోలీసులు గురువారం నాడు సీజ్ చేశారు. పొగాకు ఉత్ప‌త్తులైన అంబ‌ర్ జ‌ర్దా, గుట్కా ప్యాకెట్ల‌ను సిద్దిపేట‌లోని వేముల‌వాడ క‌మాన్ వ‌ద్ద ఓ కారులో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇన్‌స్పెక్ట‌ర్ ప‌ర‌శురాం గౌడ్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం... నిందితులు తోట బాల‌చంద్రం, సోల స‌తీష్ చిన్న‌కోడూరు మండ‌లం విట‌లాపూర్ గ్రామానికి చెందిన ఇరువురు నాలుగు బ్యాగుల్లో పొగాకు ఉత్ప‌త్తుల‌ను త‌ర‌లిస్తున్న‌ట్లు తెలిపారు. అక్ర‌మ ర‌వాణాపై కేసు న‌మోదు చేసిన‌ట్లు పేర్కొన్నారు. 


logo