బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Oct 31, 2020 , 12:53:02

ఇంట్లో నాటుబాంబులు స్వాధీనం

ఇంట్లో నాటుబాంబులు స్వాధీనం

కామారెడ్డి : భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలోని ఓ ఇంట్లో శనివారం పోలీసులు నాటు బాంబులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన సిద్ధిరామయ్య అనే వ్యక్తి ఇంట్లో శుక్రవారం సాయంత్రం నాటుబాంబు పేలి పాక్షికంగా ధ్వంసమైంది. నీళ్లలో తడిసిన నాటుబాంబును ఎలక్ట్రిక్‌ బల్బుతో వేడి చేస్తుండగా అది పేలింది.

ఈ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఉదయం ఇంట్లో  సోదాలు నిర్వహించి నాటు బాంబులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అడవి పందులను వేటాడేందుకు వీటిని తీసుకొచ్చి భద్రపరిచినట్లు ఎస్‌ఐ నవీన్‌కుమార్‌ తెలిపారు. ఇంట్లో నాటుబాంబులు పట్టుబడటంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు.   

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.