గురువారం 04 జూన్ 2020
Telangana - May 16, 2020 , 21:36:25

మహిళ ప్రాణాలు కాపాడిన పోలీసులు

మహిళ ప్రాణాలు కాపాడిన పోలీసులు

హైదరాబాద్‌: కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గ పరిధిలోని ఎన్‌సీఎల్‌ కాలనీలో వివిధ కారణాలతో జీవితంపై విసుగు చెందిన ఓ మహిళ శనివారం సాయంత్రం తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య యత్నం చేసింది. ఇది గమనించిన స్థానికులు ఆమెను కాపాడి చికిత్స కోసం వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అంబులెన్స్‌ రాక పోవటంతో ఈ విషయాన్ని స్థానికులు పేట్‌ ్టబషీరాబాద్‌ సీఐ మహేష్‌ దృష్టికి తీసుకు వచ్చారు. వెంటనే అప్రమత్తమైన సీఐ మహేష్‌ ఘటన స్థలానికి పోలీసు వాహనాన్ని పంపి  అపాయంలో ఉన్న మహిళను పోలీస్‌ వాహనంలో ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు. ఆపదలో ఉన్నవారిని కాపాడినందుకు,  తక్షణమే స్పందించిన స్థానిక పోలీసులను సైబరాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌ వీసీ సజ్జనార్‌ అభినందించారు. మరోవైపు ఘటనను తెలుసుకున్న పలువురు ఆపద కాలంలో మహిళ ప్రాణాలను కాపాడిన పేట్‌ బషీరాబాద్‌ పోలీసులను అభినందించారు.


logo