శనివారం 24 అక్టోబర్ 2020
Telangana - Oct 10, 2020 , 18:07:11

ప్రాణాలను కాపాడిన పోలీసులు

ప్రాణాలను కాపాడిన పోలీసులు

ఖమ్మం : రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు ఖమ్మం టూటౌన్‌ పోలీసులు. బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని ఖమ్మం టూటౌన్ పోలీసు స్టేషన్ సమీపంలో వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో అతడికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పెట్రోలింగ్‌ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని బాధితుడిని పెట్రోలింగ్‌ వాహనంలోనే స్థానిక ప్రభుత్వ దవాఖానకు తరలించారు. సకాలంలో చికిత్స అందడంతో అతడికి ప్రాణాపాయం తప్పింది. దీంతో  టూటౌన్ ఇన్‌స్పెక్టర్‌ తుమ్మ గోపి సిబ్బందిని అభినందించారు. గుర్తింపు కార్డు ఆధారంగా బాధితుడిని ఖమ్మం వీడియోస్ కాలనీ నివాసి శ్రీనివాసరావుగా గుర్తించి కుటుంబీలకు సమాచారం అందించారు. ప్రస్తుతం శ్రీనివాసరావు లక్ష్మీదేవిపల్లి పంచాయతీ సెక్రటరీగా పని చేస్తున్నాడు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo