శనివారం 16 జనవరి 2021
Telangana - Dec 29, 2020 , 01:50:05

హైదరాబాద్‌ శివారులో అర్ధనగ్న నృత్యాలు

హైదరాబాద్‌ శివారులో అర్ధనగ్న నృత్యాలు

  • పోలీసుల దాడులు.. 16 మంది అరెస్టు

కీసర: అసాంఘిక కార్యకలాపాలు, అర్ధనగ్న నృత్యాలు సాగుతున్న నగరశివార్లలోని ఓ రిసార్ట్‌పై దాడులు చేసిన పోలీసులు 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. కీసర సీఐ జే నరేందర్‌గౌడ్‌ కథనం ప్రకారం.. మేడ్చల్‌ జిల్లా, కీసర మండలం, తిమ్మాయిపల్లి గ్రామంలోని ఫారెస్ట్‌ రీడ్జ్‌ రిసార్ట్‌లో..  ప్రైవేటు విత్తనాల కంపెనీ యజమాని ప్రభాకర్‌రెడ్డి తన డీలర్ల కోసం ఓ విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు ఇతర ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి అర్ధనగ్న నృత్యాలు చేయిస్తున్నట్టు పోలీసులకు సమాచారమందింది. దీంతో ఆ రిసార్ట్‌పై దాడి చేసి ప్రభాకర్‌రెడ్డితోపాటు మరో తొమ్మిది మంది వ్యాపారులను, ఆరుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసినవారిని కోర్టులో హాజరుపరిచామని సీఐ తెలిపారు. అరెస్టయిన సరూర్‌నగర్‌కు చెందిన దండు భాస్కర్‌వర్మ, కూకట్‌పల్లికి చెందిన గౌని వెంకటేశ్‌, గజ్వేల్‌కు చెందిన చింది ప్రభాకర్‌రెడ్డి, షేక్‌ రఫీ, జనగాంకు చెందిన వజనపల్లి వేణుగౌడ్‌, యాదాద్రి జిల్లా, మోత్కూర్‌కు చెందిన అనంతులు వెంకటేశ్వర్లు, వరంగల్‌కు చెందిన నోముల భిక్షపతి, బానోతు కుమారి, మెదక్‌కు చెందిన సురారం మల్లికార్జునరెడ్డి, నాయిని రజనీకాంత్‌, మురళి ఉన్నారు.