బుధవారం 21 అక్టోబర్ 2020
Telangana - Oct 05, 2020 , 13:08:56

పేకాట స్థావరంపై పోలీసుల దాడి..ఏడుగురు అరెస్ట్

పేకాట స్థావరంపై పోలీసుల దాడి..ఏడుగురు అరెస్ట్

మంచిర్యాల : జిల్లా కేంద్రంలోని తిలక్ నగర్ లో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆకస్మిక దాడి చేశారు. రహస్యంగా పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని 25,860/- రూపాయల నగదు, నాలుగు బైకులు, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. జాదవ్ రాహుల్ అనే వ్యక్తి ఇంట్లో రహస్యంగా పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పోలీసులు దాడి చేసి  ఏడుగురు వ్యక్తులను పట్టుకున్నారు.

మరో వ్యక్తి పరారీలో ఉన్నారు. జాదవ్ రాహుల్, వినయ్, చంద్రగిరి మహేష్ పటేల్, గుంట ప్రసాద్, కొత్త సంతోష్ పెద్దపల్లి సాయి కృష్ణ,  సుధాకర్ ను అరెస్ట్ చేశారు. పారిపోయిన వ్యక్తి అనిల్  బ్యాంక్ ఉద్యోగిగా గుర్తించారు. ఈ దాడిలో రామగుండం టాస్క్ ఫోర్స్ ఎస్ఐ కిరణ్, సిబ్బంది సంపత్ కుమార్, భాస్కర్ గౌడ్ పాల్గొన్నారు.


logo