మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Sep 29, 2020 , 12:58:50

హేమంత్ హ‌త్య కేసు.. నిందితుల క‌స్ట‌డీకి పిటిష‌న్‌

హేమంత్ హ‌త్య కేసు.. నిందితుల క‌స్ట‌డీకి పిటిష‌న్‌

హైద‌రాబాద్ : హేమంత్ హ‌త్య కేసులో నిందితుల క‌స్ట‌డీకి పోలీసులు కూక‌ట్‌ప‌ల్లి కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. నిందితుల‌ను ఐదు రోజుల పాటు క‌స్ట‌డీకి ఇవ్వాల‌ని పోలీసులు కోర్టుకు విన్న‌వించారు. నిందితుల నుంచి మ‌రింత స‌మాచారం సేక‌రించాల్సి ఉంద‌ని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఈ హ‌త్య కేసులో యుగంధ‌ర్ రెడ్డి కుట్ర‌దారుగా ఉన్నారు. సుపారీ కిల్ల‌ర్స్ ద్వారా హేమంత్‌ను హ‌త్య చేయించారు. ల‌క్ష్మారెడ్డి, యుగంధ‌ర్ రెడ్డితో పాటు సుపారీ కిల్ల‌ర్స్ ను విచారించాల‌ని పోలీసులు పేర్కొన్నారు. 

ర‌క్ష‌ణ క‌ల్పించండి : హేమంత్ కుటుంబీకులు

గ‌చ్చిబౌలి పోలీసు స్టేష‌న్‌కు హేమంత్ త‌ల్లిదండ్రులు, భార్య అవంతి ఈ ఉద‌యం వెళ్లారు. నిందితుల‌కు క‌ఠిన శిక్ష పడేలా చూడాల‌ని మాదాపూర్ డీసీపీ వెంక‌టేశ్వ‌ర్లును వారు కోరారు. త‌మ‌కు ప్రాణ‌హాని ఉంద‌ని హేమంత్ కుటుంబీకులు డీసీపీకి ఫిర్యాదు చేశారు. త‌మ‌కు ర‌క్ష‌ణ‌, న్యాయం క‌ల్పించాల‌ని కోరారు. హేమంత్ మృత‌దేహం ల‌భ్య‌మైన ప్రాంతంలో ఉన్న అత‌ని సెల్‌ఫోన్‌తో పాటు పోస్టుమార్టం రిపోర్ట్‌ను అత‌ని కుటుంబ స‌భ్యుల‌కు పోలీసులు అంద‌జేశారు. 


logo