శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 13, 2020 , 02:31:36

పోలీస్‌ జాగిలం మృతి

పోలీస్‌ జాగిలం మృతి

  • పోలీస్‌ లాంఛనాలతో అంత్యక్రియలు

మహబూబాబాద్‌ రూరల్‌: అనారోగ్యంతో పోలీస్‌ జాగిలం(లియో) మృతిచెందింది. తమతోపాటు రోజూ బందోబస్తులో పాల్గొనే జాగిలం మృతితో సిబ్బంది కన్నీటి పర్యంతమయ్యారు. మహబూబాబాద్‌ జిల్లా పోలీస్‌ హెడ్‌ క్వార్టర్‌లో మొత్తం నాలుగు జాగిలాలతో పోలీస్‌ సిబ్బంది బందోబస్తు విధులను నిర్వర్తిస్తున్నారు. అందులోని లియో అనే జాగిలం రెండు రోజులుగా అనారోగ్యంతో ఉండగా, మహబూబాబాద్‌లోని వెటర్నరీ దవాఖానలో చికిత్స చేయించారు. పరిస్థితి విషమించి ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు మృతిచెందింది. లియో మృతికి ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి సంతాపం తెలిపారు. ఆయన ఆదేశాలతో పోలీస్‌ మర్యాదలతో దానికి అంత్యక్రియలు నిర్వహించారు.  


logo