శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Telangana - Sep 16, 2020 , 03:35:24

పోలీస్‌ అంతర్గత సేవలు ఆన్‌లైన్‌లో

పోలీస్‌ అంతర్గత సేవలు ఆన్‌లైన్‌లో

  • ఆటోమేటెడ్‌ హెచ్‌ఆర్‌ఎంఎస్‌ అమలు
  • అధికారులతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర పోలీస్‌శాఖలోని 80 వేల మంది సిబ్బంది పరిపాలన వ్యవహారాల కు మానవ వనరుల నిర్వహణ విధానం (హెచ్‌ఆర్‌ఎంఎస్‌) ద్వారా పూర్తి సాంకేతికంగా నిర్వహించాలని పోలీస్‌శాఖ నిర్ణయించింది.  రాష్ట్రవ్యాప్తంగా ఈ ఆటోమేటెడ్‌ హెచ్‌ఆర్‌ఎంఎస్‌ విధానం అమలుపై డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి.. అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు, ఇతర యూనిట్ల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మంగళవారం తన కార్యాలయం నుంచి అడిషనల్‌ డీజీలు జితేందర్‌, గోవింద్‌సింగ్‌, సందీప్‌శాండిల్య, శివధర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి పలు సూచనలిచ్చారు. 2018లో కొన్ని విభాగాల్లో ప్రారంభించిన ఈ విధానం.. బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌శాఖ మొత్తంలో అమలవుతుందని తెలిపారు. ఈ విధానంలో టీఎస్‌కాప్‌ మాదిరిగా ఒక మొబైల్‌యాప్‌లో ప్రతిఒక్క సిబ్బందికి యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఇస్తారు. వారికి సంబంధించిన పూర్తి వివరాలు, సెలవులు, ఇతర సర్వీస్‌ అంశాలు దీనితో ఉన్నతాధికారులు తెలుసుకునే వీలు ఉంటుంది.


logo