బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 25, 2020 , 01:52:40

సరిహద్దుల్లో పోలీసుల తనిఖీలు

సరిహద్దుల్లో పోలీసుల తనిఖీలు

  • మావోయిస్టుల బంద్‌ పిలుపుతో అప్రమత్తమైన పోలీసులు

కోటపల్లి : సీపీఐ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ శనివారం బంద్‌కు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాతోపాటు పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలోనూ మావోయిస్టుల కదలికలు పెరగడంతో తెలంగాణ పోలీసులు సరిహద్దుల్లో తనిఖీలు చేస్తున్నారు. బంద్‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చెన్నూర్‌ సీఐ నాగరాజు, ఎస్సై రవికుమార్‌ ఆధ్వర్యంలో కోటపల్లి మం డలం రాంపూర్‌ జాతీయ రహదారి-63పై పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. అనుమానితులను, కొత్త వ్యక్తులను విచారిస్తూ వారి వివరాలను నమోదు చేసుకుంటున్నారు. సరిహద్దు గ్రామా ల్లో ఇప్పటికే పోలీస్‌ అధికారులు పర్యటించి భద్రతను సమీక్షించారు. మాజీ మావోయిస్టులు, మావోయిస్టు సానుభూతి పరులతో సమావేశం నిర్వహించిన పోలీసులు సంఘ విద్రోహ శక్తులకు సహకరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సరిహద్దులను సీఆర్‌పీఎఫ్‌, స్పెషల్‌ పార్టీ, సివిల్‌ పోలీసులు జల్లెడ పడుతున్నారు.     


logo