మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Aug 05, 2020 , 04:15:13

మీ పాస్‌వర్డ్‌లో బలమెంత?

మీ పాస్‌వర్డ్‌లో బలమెంత?

 • మీ ప్రైవసీ సెట్టింగ్స్‌ క్షేమమా?
 • సైబర్‌ నేరగాళ్లతో జరభద్రం
 • పెరుగుతున్న నెట్‌ వినియోగం
 • అదే స్థాయిలో సైబర్‌ నేరాలు
 • జాగ్రత్తలు సూచిస్తున్న పోలీసులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆర్థిక విషయాలకు సంబంధించి ప్రజా వైఫై వాడుతున్నారా? సురక్షితం కాని వెబ్‌సైట్లు వినియోగిస్తున్నారా? సోషల్‌మీడియా ఖాతాలకు బలమైన పాస్‌వర్డ్‌లను పెట్టుకోలేదా? అయితే మీకు సైబర్‌ ముప్పు పొంచిఉన్నట్టే. ఇంటర్నెట్‌ వినియోగంతో ఎన్ని సౌలత్‌లు వచ్చాయో.. అదేస్థాయిలో సైబర్‌ దొంగల ముప్పు పెరిగింది. ‘కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నాం’ అన్న సినిమా డైలాగ్‌.. సైబర్‌ సెక్యూరిటీ అంశానికి అతికినట్టు సరిపోతున్నది. ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఏదో ఒకచోట నుంచి శత్రువు దాడిచేస్తున్నాడు. నానాటికి సైబర్‌ దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సైబర్‌క్రైం పోలీసులు, సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు. 

ఇవి గుర్తుంచుకోండి

 • మీ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లలో ఎప్పటికప్పుడు సాఫ్ట్‌వేర్‌, ఆపరేటింగ్‌ సిస్టంలు అప్‌డేట్‌ చేసుకోవాలి. 
 • కచ్చితమైన యాంటీ వైరస్‌ సాఫ్ట్‌వేర్లు ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి.
 • మీ సోషల్‌ నెట్‌వర్కింగ్‌ ప్రొఫైల్స్‌ను ప్రైవసీ సెట్టింగ్స్‌లో పెట్టుకోవాలి.
 • సురక్షితమైన వెబ్‌సైట్లను మాత్రమే వినియోగించాలి. 
 • మీ సోషల్‌మీడియా ఖాతాలకు స్ట్రాంగ్‌ పాస్‌వర్డ్‌ పెట్టుకోవాలి.
 • స్పామ్‌ ఈ మెయిల్స్‌లో ఉండే అటాచ్‌మెంట్లను ఓపెన్‌ చేయకూడదు. 
 • అపరిచిత వ్యక్తులకు, ఆన్‌లైన్‌ ద్వారా, టెలిఫోన్లలో బ్యాంకు అధికారులుగా పరిచయం చేసుకునేవారికి ఖాతా వివరాలు ఇవ్వకూడదు. ఏ బ్యాంకు కూడా మన వివరాలు అడుగదు.
 • పబ్లిక్‌ ప్రదేశాల్లో వైఫై, హాట్‌స్పాట్‌ను వీలైనంత వరకు వాడకపోవడం ఉత్తమం. ఒకవేళ వాడినా జాగ్రత్తగా ఉండాలి.
 • పిల్లలు ఆన్‌లైన్‌లో ఏ వెబ్‌సైట్లు చూస్తున్నారు, ఎలాంటి విషయాలను ఫాలో అవుతున్నారన్న దానిపై తల్లిదండ్రులు ఓ కన్నేయాలి.


logo