శుక్రవారం 23 అక్టోబర్ 2020
Telangana - Sep 21, 2020 , 09:47:13

తెలంగాణ-ఛతీస్‌గఢ్‌ సరిహద్దులో పోలీసుల హైఅలర్ట్‌

తెలంగాణ-ఛతీస్‌గఢ్‌ సరిహద్దులో పోలీసుల హైఅలర్ట్‌

భద్రాద్రికొత్తగూడెం : మావోయిస్టు ప్రాబల్యమున్నతెలంగాణ-ఛతీస్‌గఢ్‌ సరిహద్దులో పోలీసులు హైఅలర్ట్‌ ప్రకటించారు. నేటి నుంచి ఈ నెల 28 వరకు మావోయిస్టు పార్టీ వారోత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి జగన్‌ పిలుపునిచ్చిన నేపథ్యంలో గస్తీ పెంచారు. ఉనికి చాటుకునే చర్యలకు పాల్పడే అవకాశం ఉండటంతో మరింత అప్రమత్తమయ్యారు. అడవుల్లో విస్తృతంగా కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపైనా దృష్టిపెట్టారు. అనుమానం వచ్చిన వాటిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కలివేరు వాగు వద్ద రెండురోజుల క్రితం మందుపాతరను గుర్తించిన పోలీసులు నిర్వీర్యం చేసిన విషయం తెలిసిందే. పదిరోజుల క్రితం పెద ముసిలేరు గ్రామశివారులో పైడి వాగు వద్ద ప్రధాన రహదారిపై మావోయిస్టులు మందుపాతర పెట్టి పేల్చివేశారు.   

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo