బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Nov 10, 2020 , 15:36:54

ప్ర‌జ‌ల సేవ‌కే పోలీసులు : డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి

ప్ర‌జ‌ల సేవ‌కే పోలీసులు : డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి

హైద‌రాబాద్ : మానవసేవయే - మాధవ సేవ' అన్నది ఎంత నిజమో.. "ప్రజల సేవకే - పోలీసులు" అన్నదీ అంతే నిజం అని రాష్ర్ట డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి అన్నారు. న‌గ‌రంలోని అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పెట్రోలింగ్ సిబ్బంది ఈ రోజు జేఎన్ఎన్‌యూఆర్ఎం కాల‌నీలో అనారోగ్యంతో రోడ్డుపై ప‌డిఉన్న ఓ మ‌హిళ(50)‌కు ప్ర‌థ‌మ చికిత్స అందించారు. అనంత‌రం ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రానికి త‌ర‌లించారు. ఆస్ప‌త్రిలో చికిత్స అనంత‌రం మ‌హిళ‌ను కుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌గించారు. ఈ చ‌ర్య‌పై డీజీపీ ట్విట్ట‌ర్ ద్వారా స్పందిస్తూ స‌ద‌రు పోలీస్ సిబ్బంది శివ‌కుమార్‌, మౌనిక‌, మ‌నీషా, హోంగార్డు లింగంని ప్ర‌శంసిస్తూ అభినంద‌న‌లు తెలియ‌జేశారు. ప్ర‌జ‌ల సేవ‌కే పోలీసులు అన్న‌ది నిరూపించార‌న్నారు.