శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 13, 2020 , 22:21:56

మావోయిస్టుల చెర నుంచి పోలీస్‌ ఉద్యోగి విడుదల

మావోయిస్టుల చెర నుంచి పోలీస్‌ ఉద్యోగి విడుదల

చర్ల రూరల్‌ : తమ అదుపులోకి తీసుకొన్న పోలీస్‌ ఉద్యోగి (ఎలక్ట్రీషియన్‌) కట్టం సంతోష్‌ని మావోయిస్టులు విడుదల చేశారు.  ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన పోలీస్‌ ఉద్యోగి కిడ్నాప్‌ విడుదల వివరాలు ఇలా ఉన్నాయి. కట్టం సంతోష్‌ అనే వ్యక్తి ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లా భోపాలపట్నంలో పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో ఎలక్ట్రీషియన్‌గా విథులు నిర్వహిస్తున్నాడు. కాగా తన మిత్రులతో కలిసి ఈనెల 4న గోర్న ఆలయంలో పూజలు చేయడానికి వెళ్లాడు. ఆ సమయంలో అక్కడికి సాధారణ దుస్తుల్లో వచ్చిన మావోయిస్టులు.. సంతోష్‌ని పోలీస్‌గా అనుమానించి తమ వెంట తీసుకెళ్ళారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు, బంధువులు సంతోష్‌ విడుదల కోసం స్థానిక పాత్రికేయులను ఆశ్రయించారు. ఈనెల 11న ప్రజాకోర్టులో సంతోష్‌ని ప్రవేశపెట్టారు.  ప్రజాకోర్టుకి హాజరైన వారిలో మెజారిటీ ప్రజలు కూడా సంతోష్‌ని విడుదల చేయాలని చెప్పడంతో సంతోష్‌ని మావోయిస్టులు విడుదల చేశారు.  7 రోజులపాటు ఉత్కంఠగా కొనసాగిన కిడ్నాప్‌ కథ సుఖాంతమవడంతో అందరు సంతోషించారు.


logo