శనివారం 23 జనవరి 2021
Telangana - Dec 23, 2020 , 21:51:27

ధర్మపురిలో పోలీసుల కార్డన్‌ సెర్చ్‌..

 ధర్మపురిలో పోలీసుల కార్డన్‌ సెర్చ్‌..

ధర్మపురి : జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని దుర్గాకాలనీలో బుధవారం రాత్రి పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. జిల్లా ఎస్పీ సింధూశర్మ ఆదేశాల మేరకు సీఐ రామ్‌చందర్‌రావ్‌ ఆధ్వర్యంలో ధర్మపురి, బుగ్గారం, వెల్గటూర్‌, గొల్లపెల్లి ఎస్‌ఐలు కిరణ్‌కుమార్‌, చిరంజీవి, ప్రేమ్‌కుమార్‌, జీవన్‌లతోపాటు 60 మంది పోలీస్‌ సిబ్బంది కాలనీలోని ఇంటింటిని తనిఖీలు చేశారు. అనుమానాస్పద వ్యక్తుల వివరాలను సేకరించారు.

అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు బాలికలను గుర్తించి జిల్లా కేంద్రంలోని సఖీ కేంద్రానికి తరలించారు. ఈ సందర్భంగా సీఐ రామ్‌చందర్‌రావ్‌ మాట్లాడుతూ.. ఎస్పీ ఆదేశాల మేరకు దుర్గా కాలనీలోని దాదాపు 45 ఇండ్లల్లో తనిఖీలు చేసినట్లు తెలిపారు. ఇంట్లో నివసిస్తున్న కుటుంబ సభ్యుల వివరాలు, ఆధార్‌కార్డులు, వాహనాల రిజిస్ట్రేషన్‌ పత్రాలు పరిశీలించినట్లు తెలిపారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo