మంగళవారం 07 జూలై 2020
Telangana - Jun 19, 2020 , 16:08:43

నగల దుకాణం చోరీని ఛేదించిన పోలీసులు

నగల దుకాణం చోరీని ఛేదించిన పోలీసులు

హైదరాబాద్‌ : నగరంలోని నేరెడ్‌మెట్‌లో జరిగిన నగల దుకాణం చోరీ కేసును రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు విజయవంతంగా ఛేదించారు. నేరేడ్‌మెట్‌లో ఉంటున్న అప్పురామ్‌కు కేశవనగర్‌ చౌరస్తాలో ధనలక్ష్మి నగల దుకాణం ఉంది. దొంగలు ఈ నెల 12న ఈ నగల దుకాణంలో చోరీకి పాల్పడ్డారు. దొంగలు దుకాణం తలుపులు, షట్టరు బద్దలు కొట్టకుండా తాళాలు తెరిచి చోరీకి పాల్పడ్డారు.

బంగారు, వెండి ఆభరణాలు అపహరించుకుపోయారు. లోపల ఉన్న  సీసీ కెమెరాల డిజిటల్‌ వీడియో రికార్డర్‌ను కూడా పట్టుకెళ్లారు. బాధిత యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసును విజయవంతంగా ఛేదించారు. దొంగల నుంచి రూ. 47.27 లక్షల విలువైన బంగారం, వెండి నగలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ నలుగురు నిందితులు రాజస్థాన్‌ వాసులుగా సమాచారం.


logo