e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home టాప్ స్టోరీస్ అన్ని హంగులతో పోలీస్‌ భవనాలు

అన్ని హంగులతో పోలీస్‌ భవనాలు

అన్ని హంగులతో పోలీస్‌ భవనాలు
  • సిద్దిపేట,కామారెడ్డిలో కార్యాలయాలు పూర్తి
  • 20న ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌
  • కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, పబ్లిక్‌ గ్రీవెన్స్‌హాల్‌
  • కార్పొరేట్‌ సంస్థల తరహాలో రిసెప్షన్‌ సెంటర్లు

హైదరాబాద్‌, జూన్‌ 17(నమస్తే తెలంగాణ): పోలీసు కార్యాలయాలు ప్రజాసేవకు వేదికలుగా మారాలన్న సీఎం కేసీఆర్‌ ఆలోచనకు అనుగుణంగా అత్యాధునిక హంగులతో నిర్మించిన సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం, కామారెడ్డి జిల్లా పోలీస్‌ కార్యాలయాలు ప్రారంభోత్సవాలకు సిద్ధమయ్యాయి. పోలీస్‌ సేవలు మరింత చేరువ చేసేందుకు సాంకేతికతను, సౌకర్యాన్ని జోడించి నిర్మించిన ఈ భవనాలను 20న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పోలీస్‌ కార్యాలయాలు చాలాచోట్ల నిజాం కాలంనాటి భవనాల్లో, శిథిలావస్థకు చేరిన భవనాల్లో ఉండేవి. తెలంగాణ ఏర్పడ్డాక పోలీస్‌శాఖకు ప్రభు త్వం భారీగా నిధులు కేటాయించి శాశ్వతప్రాతిపదికన భవనాల నిర్మిస్తున్నది. రూ.19 కోట్ల చొప్పున సిద్దిపేట పోలీస్‌ కమిషనరేట్‌, కామారెడ్డి జిల్లా పోలీస్‌ కార్యాలయాన్ని నిర్మించారు. నూతన భవనాలను ప్రజావసరాలకు అనుగుణంగా పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ తీర్చిదిద్దింది.

దూరదృష్టితోనే భవన నిర్మాణాలు
శాంతిభద్రతలు సరిగా ఉంటేనే రా ష్ర్టానికి పెట్టుబడులు వస్తాయన్న దూరదృష్టి కలిగిన నేత సీఎం కేసీఆర్‌. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ల నుంచే పోలీస్‌ శాఖను బలోపేతం చేసేదిశగా చర్యలు తీసుకున్నారు. పోలీసు సేవ లు ప్రజలకు మరింత చేరువయ్యేలా శాశ్వత ప్రాతిపదికన పోలీస్‌ భవనాల నిర్మాణాలను పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చేపట్టింది. కామారెడ్డి డీపీవో, సిద్దిపేట కమిషనరేట్‌ను అత్యాధునిక సదుపాయాలతో నిర్మిం చాం. త్వరలో మరిన్ని భవనాలు అందుబాటులోకి వస్తాయి. – కోలేటి దామోదర్‌, పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌

- Advertisement -

ఇవీ ప్రత్యేకతలు..

సిద్దిపేట కమిషనరేట్‌ మూడు అంతస్థుల్లో 58,228 చదరపు అడుగుల విస్తీర్ణంతో, కామారెడ్డి జిల్లా పోలీస్‌ కార్యాలయాన్ని రెండు అంతస్థుల్లో 51,918 చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మించారు. దీనిలో కమిషనర్‌, ఎస్పీల కార్యాలయాలతోపాటు డీఎస్పీ చాంబర్లు, కాన్ఫరెన్స్‌ హాల్‌, స్పెషల్‌బ్రాంచ్‌, పాస్‌పోర్టు వెరిఫికేషన్‌ సెల్‌.. మొదటి అంతస్థులో అడ్మినిస్ట్రేషన్‌ విభాగాలు, రెండో అంతస్థులో కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, ఎలక్ట్రికల్‌ ప్యానెల్‌రూం, ఐటీ కోర్‌టీం, క్లూస్‌టీం, విశాలమైన పార్కింగ్‌ సదుపాయలు కల్పించారు. ఫిర్యాదులు, ఇతర పనులపై వచ్చే సామాన్యప్రజలతో ఎస్పీ, కమిషనర్‌ నేరుగా మాట్లాడేలా రూపొందించిన పబ్లిక్‌ గ్రీవెన్స్‌హాల్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నది. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ద్వారా ఆ జిల్లా లేదా పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని అన్ని ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల దృశ్యాలను ఇక్కడి నుంచి చూడవచ్చు. పరేడ్‌ గ్రౌండ్‌, ఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌, బ్యారక్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. భవన నిర్మాణం రెండో దశలో ఎమినిటీస్‌ బ్లాక్‌, డాగ్‌ కెన్నెల్స్‌, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ సిబ్బంది నివాస గృహ సదుపాయాలు సమకూర్చనున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అన్ని హంగులతో పోలీస్‌ భవనాలు
అన్ని హంగులతో పోలీస్‌ భవనాలు
అన్ని హంగులతో పోలీస్‌ భవనాలు

ట్రెండింగ్‌

Advertisement