మంగళవారం 07 ఏప్రిల్ 2020
Telangana - Mar 02, 2020 , 01:48:56

నలుగురు గంజాయి స్మగ్లర్లపై పీడీ యాక్ట్‌

నలుగురు గంజాయి  స్మగ్లర్లపై పీడీ యాక్ట్‌

రెడ్డికాలనీ (వరంగల్‌): గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న నలుగురు నిందితులపై వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ విశ్వనాథ రవీందర్‌ శనివారం పీడీ యాక్ట్‌ నమోదు చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా పరకాల మండలానికి చెందిన బొచ్చు భానుచందర్‌, జయశంకర్‌ జిల్లా మొగుళ్లపల్లి మండలం ఇస్సిపేట గ్రామానికి చెందిన గైకోటి శ్రీనివాస్‌, ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెంకు చెందిన గద్దల శ్రీకాంత్‌, జయశంకర్‌ జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన చల్లగురుగుల శంకర్‌పై పీడీ యాక్ట్‌ నమోదైంది. పోలీస్‌ కమిషనర్‌ జారీచేసిన ఉత్తర్వులను ఆత్మకూరు ఇన్‌స్పెక్టర్‌ రంజిత్‌కుమార్‌ వరంగల్‌ కేంద్ర కారాగారంలో ఉన్న నిందితులకు జైలర్‌ సమక్షంలో అందజేశారు. 
logo