శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 16, 2020 , 11:41:33

భదాద్రి కొత్తగూడెంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు

భదాద్రి కొత్తగూడెంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు

మణుగూరు : భదాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సబ్ డివిజన్‌లో కరకగూడెం మండలం మల్లెపల్లితోగు అటవీ ప్రాంతంలో  మావోయిస్టులు, పోలీసులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ పోలీసుకు గాయాలు కాగా ఎటువంటి ప్రాణనట్టం జరగలేదని  ఎస్పీ సునీల్ దత్‌ తెలిపారు. బుధవారం ఉదయం 9.00 గంటలకు పోలీసులు కూంబింగ్ చేపడుతున్న సమయంలో మావోయిస్టులు ఎదురయ్యారని,  పోలీసులను చూసి వారు కాల్పులకు దిగారని తెలిపారు.

దీంతో పోలీసులు కూడా కాల్పులు జరపడంతో  సంఘటనా స్థలంలో మందుగుండు సామగ్రితో పాటు పలు ఆయుధాలను వదిలేసి పారిపోయారని చెప్పారు.  ఓ బ్యాగు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు.  ఆ ప్రాంతాన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విస్తృతంగా కూంబింగ్ చేపడుతున్నామన్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo