శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 26, 2020 , 01:32:58

డబ్బు కాదు.. ప్రాణమే ముఖ్యం

డబ్బు కాదు.. ప్రాణమే ముఖ్యం

  • ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలి: స్పీకర్‌ పోచారం

హైదరాబాద్‌, నమస్తే తెలం గాణ: కరోనా నేపథ్యంలో పోలీసు, ప్రభుత్వ యంత్రాం గానికి ప్రజలు సహకరించా లని స్పీకర్‌ పోచారం శ్రీనివా స్‌రెడ్డి కోరారు. డబ్బు కాదు.. ప్రాణమే ముఖ్యమని, దీన్ని విస్మరించొద్దన్నారు. బుధవా రం వీడియో సందేశం ద్వారా ప్రజలకు పోచారం ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ముందుచూపుతో కరోనాను నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలకు అను గుణంగా అధికారులు చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. ఈ నిబంధనలు మన కోసం, మన రాష్ట్రం, దేశం కోసమేననే విషయాన్ని గ్రహించాలని చెప్పా రు. మన ఇంటికి మనమే వైద్యులం కావాలని, ప్రతి ఒక్కరూ స్వీయ గృహనిర్బంధాన్ని పాటించాలని ఆయన పిలుపునిచ్చారు.


logo