సోమవారం 30 మార్చి 2020
Telangana - Mar 03, 2020 , 01:18:06

‘డబుల్‌' ఇండ్లతో నిరుపేదల కల సాకారం

‘డబుల్‌' ఇండ్లతో నిరుపేదల కల సాకారం
  • స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి

బాన్సువాడ రూరల్‌/వర్ని: గూడులేని నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్‌ శివారులో ఐదువందల డబుల్‌బెడ్‌రూం ఇండ్లు నిర్మించగా మొదటి విడుత కింద 163 ఇండ్లను జిల్లా కలెక్టర్‌ శరత్‌తో కలిసి సోమవారం లబ్ధిదారులకు కేటాయించారు. అంతకుముందు నిజామాబాద్‌ జిల్లా వర్ని మండలంలోని వర్ని సొసైటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో స్పీకర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్‌ పోచారం మాట్లాడుతూ.. 70 ఏండ్లలో ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా సీఎం కేసీఆర్‌ డబుల్‌బెడ్‌రూం ఇండ్ల ను అందజేసి పేద కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారని కొనియాడారు.  
logo