సోమవారం 06 జూలై 2020
Telangana - Jun 07, 2020 , 15:33:10

నిజాంసాగర్‌కు కాళేశ్వరం జలాలు

నిజాంసాగర్‌కు కాళేశ్వరం జలాలు

నిజామాబాద్‌: పేదింటి ఆడబిడ్డ ఆత్మగౌరవం కాపాడటానికే డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల పథకాన్ని ప్రభుత్వం చేపట్టిందని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. ఆయన ఈ రోజు నిజామాబాద్‌ జిల్లా కోటగిరి మండలం హంగర్గలో రూ.151 కోట్లతో నిర్మించిన 30 డబుల్‌బెడ్‌రూం ఇండ్లను ప్రారంభించారు. 

బాన్సువాడ నియోజకవర్గంలో రూ.500 కోట్లతో ఐదు వేల ఇండ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల కోసం ఎవరైనా డబ్బులు తీసుకుంటే అరెస్టు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను నిజాంసాగర్‌కు తరలిస్తామని చెప్పారు. నిజామాబాద్‌ నియోజకవర్గంలో ఏటా రెండు పంటలకు నీరందుతుందని తెలిపారు. 


logo