మంగళవారం 26 జనవరి 2021
Telangana - Feb 18, 2020 , 15:49:38

ఏసీబీకి చిక్కిన పోచారం మున్సిపాలిటీ బిల్‌ కలెక్టర్‌

ఏసీబీకి చిక్కిన పోచారం మున్సిపాలిటీ బిల్‌ కలెక్టర్‌

మేడ్చల్‌: అవినీతికి పాల్పడుతూ మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ బిల్‌ కలెక్టర్‌ ఏసీబీ అధికారులకు చిక్కాడు. బిల్‌ కలెక్టర్‌ కుమారస్వామి రూ.10 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుపడ్డాడు. ఇళ్లు గ్రామకంఠం పరిధిలో లేదని తెలియజేసే ఎన్‌ఓసీ మంజూరుకు బిల్‌ కలెక్టర్‌ లంచం డిమాండ్‌ చేసినట్లుగా సమాచారం.


logo