గురువారం 02 జూలై 2020
Telangana - Jun 25, 2020 , 00:54:38

సీఎం కేసీఆర్‌ కృషి వల్లే రాష్ర్టానికి పీఎంజీఎస్‌వై నిధులు

సీఎం కేసీఆర్‌ కృషి వల్లే రాష్ర్టానికి పీఎంజీఎస్‌వై నిధులు

  • మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: సీఎం కేసీఆర్‌ కృషి వల్లే రాష్ర్టానికి ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌ యోజన (పీఎంజీఎస్‌వై) కింద రూ.658.31 కోట్ల నిధులు మంజూరయ్యాయని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రధానమంత్రిని కలిసి, కేంద్రానికి పదేపదే లేఖలు రాయడంతోనే ఇది సాధ్యమైందని చెప్పారు. ఎవరైనా తమ వల్లే నిధులు వచ్చాయని భావిస్తే పొరపాటని, కేంద్రం తెలంగాణకు పూర్తి సానుకూలంగా లేదని బుధవారం ఒక ప్రకటన పేర్కొన్నారు. పీఎంజీఎస్‌వై కింద రాష్ర్టానికి 2,400 కిలోమీటర్ల మేర రోడ్లు వేసేందుకు నిధులు రావాల్సి ఉండగా.. ఇప్పుడు వచ్చినవి అందులో సగం కూడా లేవని తెలిపారు. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే కొందరు కేవలం తమ ప్రయత్నాలతోనే ఏదో జరిగిందని ప్రజలను నమ్మించాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు కేటాయించిన 900 కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి నిధులను వెంటనే విడుదలచేయాలని ఎర్రబెల్లి డిమాండ్‌ చేశారు. మిగిలిన 1,282 కిలోమీటర్లకు నిధులు ఇచ్చి తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని కోరారు.


logo