శుక్రవారం 05 జూన్ 2020
Telangana - Feb 09, 2020 , 02:08:42

కేసీఆర్‌ పథకాలతో మోదీకి భయం

కేసీఆర్‌ పథకాలతో మోదీకి భయం
  • దేశవ్యాప్తంగా తెలంగాణ పథకాలపై చర్చ
  • అక్కసుతోనే తెలంగాణపై ప్రధాని వ్యాఖ్యలు
  • విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి

సూర్యాపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ: తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, జరుగుతున్న అభివృద్ధిని దేశమంతా హర్షిస్తున్నదని.. ఇక్కడి పథకాలను గుజరాత్‌తోపాటు బీ జేపీ పాలిత రాష్ర్టాల్లో అమలు చేయాలని ప్రజ లు డిమాండ్‌ చేస్తుండటంతో మోదీకి భయం పట్టుకొని ఇటీవల రాజ్యసభలో తెలంగాణపై విషంకక్కారని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. శనివారం సూర్యాపేట ము న్సిపల్‌ చైర్‌పర్సన్‌గా అన్నపూర్ణ పదవీ బా ధ్యతల స్వీకార కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం స్థానిక గాం ధీపార్కులో ఏర్పాటు చేసిన సన్మాన సభలో మంత్రి ప్రసంగించారు. సీఎం కేసీఆర్‌ అమలుచేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, రైతుబంధు, రైతుబీమా, మిషన్‌ భగీరథ తదితర పథకాలను  దేశమంతా హర్షిస్తున్నదని చెప్పా రు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనివిధంగా  తె లంగాణ శాంతి, సహహనంతో ముందుకుసాగుతుందన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలంటేనే తెలంగాణ అన్న రీతిన పాలన చేస్తున్న  కేసీఆర్‌పై ఉన్న ద్వేషమే మోదీ చేసిన వ్యాఖ్యలకు అసలు కారణమని మంత్రి వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌, జెడ్పీ చైర్‌పర్సన్‌ గుజ్జ దీపికాయుగంధర్‌రావు పాల్గొన్నారు. 


జవాబుదారీగా పనిచేయాలి : మంత్రి గంగుల  

కరీంనగర్‌ ప్రజలు  సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌పై నమ్మకంతో మున్సిపల్‌ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ ఇచ్చారనీ, వారి నమ్మకం వమ్ముకాకుండా జవాబుదారీతనంతో పాలకవర్గం పనిచేయాలని బీసీసంక్షేమశాఖ మంత్రి గంగు ల కమలాకర్‌ సూచించారు. కరీంనగర్‌ మేయర్‌గా యాదగిరి సునీల్‌రావు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి గం గుల పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. నూతన మేయర్‌, పాలకవర్గం నగరాన్ని అభివృద్ధి పథంలో తీసుకపోవటంతోపాటు పారదర్శకంగా, నిజాయతీగా పాలన అందిస్తారన్న సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. కొత్త మున్సిపల్‌ చట్టం ప్రకారం తప్పు చేస్తే అధికారులు, ప్రజాప్రతినిధులకు శిక్ష తప్పదన్నారు. ఆరు నెలల్లోనే 24 గంటల మంచినీటి సరఫరాకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ కరీంనగర్‌ ప్రజలందరి అభినందనలు పొందేవిధంగా ఈ పాలకవర్గం పని చేయాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదో తరగతిలో 9.5 గ్రేడు సాధించిన విద్యార్థులకు రూ.10 వేల నగదు ప్రోత్సాహం అందించే విధంగా మేయర్‌ సునీల్‌రావు తొలి సంతకం చేశారు. సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ విజయ, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, భానుప్రసాద్‌, సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు, మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ అక్బర్‌హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.


logo