సోమవారం 25 మే 2020
Telangana - Mar 29, 2020 , 12:41:21

మన్‌ కీ బాత్‌లో హైదరాబాదీతో మాట్లాడిన ప్రధాని

మన్‌ కీ బాత్‌లో హైదరాబాదీతో మాట్లాడిన ప్రధాని

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో నేడు ప్రత్యేకంగా కోవిడ్‌-19పై మాట్లాడారు. కరోనా ప్రపంచ దేశాలకు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడం, ప్రజలు సామాజిక దూరం పాటించాల్సిన అవసరం, వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది సేవలను ప్రధాని మన్‌ కీ బాత్‌లో ప్రసంగించారు. ఈ క్రమంలో భాగంగా కోవిడ్‌-19 భారిన పడి రికవరీ అయిన హైదరాబాద్‌కు చెందిన రామ్‌ అనే వ్యక్తితో ప్రధాని మాట్లాడారు. రామ్‌ స్పందిస్తూ.. దుబాయ్‌ నుంచి తిరిగిరాగానే జ్వరంగా అనిపించింది. వెంటనే పరీక్షలు చేయించుకున్నాను. కోవిడ్‌-19 పాజిటివ్‌ అని తేలింది.

దీంతో వెంటనే క్వారంటైన్‌లోకి వెళ్లినట్లు తెలిపాడు. తన కుటుంబ సభ్యులను కూడా పరీక్షలు చేయించుకోమ్మని చెప్పినన్నాడు. వ్యాధి నుంచి రికవరీ అయి బయటపడ్డ తర్వాత సైతం కొన్ని రోజుల వరకు ఒంటరిగానే ఉన్నట్లు వెల్లడించాడు. ఇప్పటికి తన చేతులను తరచుగా శుభ్రం చేసుకుంటున్నట్లు చెప్పాడు. దీనిపై ప్రధాని స్పందిస్తూ... ఈ క్లిష్ట సమయంలో ముందస్తు జాగ్రత్త చర్యలు ఎంతో ముఖ్యమన్నారు. ఈ లాక్‌డౌన్‌ మిమ్మల్ని, మీ కుటుంబాలను సురక్షింతంగా ఉంచుతుందని తెలిపారు. అందరం కలిసి కోవిడ్‌-19ను ఓడిద్దామని ప్రధాని పిలుపునిచ్చారు. 


logo