శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Telangana - Jan 25, 2021 , 07:31:02

బాలల అవార్డు గ్రహీతలతో మాట్లాడనున్న మోదీ

బాలల అవార్డు గ్రహీతలతో మాట్లాడనున్న మోదీ

న్యూఢిల్లీ: బాలల అవార్డు గ్రహీతలో ప్రధాని మోదీ మాట్లాడనున్నారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అవార్డు విన్నర్లతో మాట్లాడుతారు. ఈ ఏడాది ప్రధానమంత్రి రాష్ట్రీయ బాలల పురస్కారానికి (పీఎంఆర్‌బీపీ) 32 మంది చిన్నారులు ఎంపికయ్యారు. కళలు, సామాజిక బాధ్యత, సంస్కృతి రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చిన బాలలకు ప్రతి ఏడాది ఈ పురస్కారాలను అందిస్తున్నారు. 

దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లోని 32 జిల్లాలకు చెందిన చిన్నారులను ఈ అవార్డులకు ఎంపికచేశారు. ఇందులో కళలు-సాంస్కృతిక విభాగంలో ఏడుగురు బాలలకు పురస్కారాలు లభించాయి. ఆవిష్కరణల విభాగంలో తొమ్మిది మందికి, స్పోర్ట్‌ విభాగంలో ఏడుగురు, ధైర్యసాహసాలు ప్రదర్శించిన ముగ్గురికి, సామాజిక సేవలో కృషిచేసిన ఒకరికి పీఎంఆబీపీ అవార్డులు లభించాయి.

VIDEOS

logo