ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Sep 04, 2020 , 08:56:43

శిక్ష‌ణ ముగించుకున్న 131 ఐపీఎస్‌లు.. నేడు పాసింగ్ ఔట్ ప‌రేడ్

శిక్ష‌ణ ముగించుకున్న 131 ఐపీఎస్‌లు.. నేడు పాసింగ్ ఔట్ ప‌రేడ్

హైద‌రాబాద్‌: న‌గర శివార్ల‌లోని స‌ర్ధార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్‌ జాతీయ పోలీస్ అకాడ‌మీలో నేడు ఐపీఎస్‌ల పాసింగ్ ఔట్ ప‌రేడ్ జ‌ర‌గ‌నున్న‌ది. 2018, 2017 బ్యాచ్‌కు చెందిన 131 మంది ఐపీఎస్‌లు విజ‌యంతంగా శిక్ష‌ణ ముగించుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాని మోదీ ఉద‌యం 11 గంట‌ల‌కు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా పాల్గొన‌నున్నారు. శిక్ష‌ణ పూర్తిచేసుకున్న ఐపీఎస్‌ల‌కు స్ఫూర్తి సందేశం ఇవ్వ‌నున్నారు. 


శిక్ష‌ణ పూర్తిచేసుకున్నవారిలో 121 మంది 2018 బ్యాచ్‌కు చెందిన‌వారుకాగా, మ‌రో ప‌ది మంది 2017 బ్యాచ్‌కు చెందిన‌వారు. ఇందులో 28 మంది మ‌హిళా ప్రొబేష‌న‌ర్లు ఉన్నారు. పాసింగ్ ఔట్ ప‌రేడ్‌కు త‌మిళ‌నాడు కేడ‌ర్‌కు చెందిన కిర‌ణ్ శృతి నాయ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. 

శిక్ష‌ణ పూర్తిచేసుకున్న‌వారిలో 11 మంది ఐపీఎస్‌ల‌ను తెలంగాణ‌కు కేటాయించ‌గా, ఐదుగురిని ఆంధ్ర‌ప్రదేశ్‌కు కేటాయించారు.  


logo