సోమవారం 30 మార్చి 2020
Telangana - Mar 26, 2020 , 16:01:37

ఎందుకొస్తరు రోడ్ల మీదకు.. ఓ రైతు ఆవేదన

ఎందుకొస్తరు రోడ్ల మీదకు.. ఓ రైతు ఆవేదన

హైదరాబాద్: నగరాల్లో పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్న యువత ధోరణిపై ఓ పల్లెటూరి రైతు ఆవేదన, ఆగ్రహంతో కూడిన నివేదన నెట్ లో వైరల్ అయింది. పల్లెల్లు తమకుతాము లాక్ డౌన్ బిగించుకుని కంపలు వేసుకుని తలుపులు మూసుకుంటుంటే పట్నాల్లో ఈ విపరీత ధోరణి ఏమిటని ఆయన మండిపడ్డారు. సర్కారు అన్నీ సమకూర్చిపెట్టి బయటికి వస్తే తమకు, సమాజానికి హాని కలుగుతుందని ప్రదాని, సీఎం చెప్తుంటే ఎందుకు ఈ విపరీత ప్రవర్తన అని రైతు గడ్డిపెట్టడడం ఈ వీడియోలో చూడవచ్చు.logo