మంగళవారం 07 ఏప్రిల్ 2020
Telangana - Mar 21, 2020 , 13:30:23

దయచేసి ప్రభుత్వ సూచనలు పాటించండి : మంత్రి కేటీఆర్‌

దయచేసి ప్రభుత్వ సూచనలు పాటించండి : మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ : కరోనాపై పోరాటంలో పౌరులు దయచేసి ప్రభుత్వ సూచనలు పాటించాల్సిందిగా రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. కరోనాపై మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా స్పందిస్తూ.. సామాజిక దూరం, వ్యక్తిగత నిర్భందం, వ్యక్తిగత నియమాలను పౌరులు తప్పనిసరిగా పాటించాల్సిందిగా సూచించారు. తక్షణం స్పందించి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్న హాంకాంగ్‌, సింగపూర్‌, జపాన్‌లు కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొంటుండగా ఇటలీ, యూఎస్‌, ఇతర దేశాలు ఏ విధంగా అల్లాడిపోతున్నాయో చూస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. కావునా ప్రభుత్వం సూచనలు పాటించి సురక్షితంగా ఉండాల్సిందిగా కేటీఆర్‌ పేర్కొన్నారు.logo