శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 25, 2020 , 13:06:11

దయచేసి మా ఊర్లోకి రాకండి..

దయచేసి మా ఊర్లోకి రాకండి..

నిజామాబాద్‌: వేలాది ప్రాణాలు తీసి, ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌.. క్రమంగా రాష్ట్రంలోనూ విస్తరిస్తోంది. కరోనా వ్యాప్తి నిలువరించేందుకు గాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రాణాంతక మహమ్మారిని అరికట్టేందుకు స్వీయ నిర్బంధమే ఉత్తమమని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో ఏమి తోచని ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. జిల్లాలోని చాలా గ్రామాల ప్రజలు కరోనా ప్రమాదాన్ని తెలుసుకొని.. ఊర్లకు వెళ్లే ప్రధాన రహదారులను కంచెలు, ట్రాక్టర్లు అడ్డం పెట్టి, రహదారులను దిగ్బంధించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దయచేసి మా ఊర్లోకి ఎవరూ రాకూడదని చేతులెత్తి దండం పెడుతున్నారు. కరోనా వైరస్‌ లక్షణాలు చాలా ఆలస్యంగా బయటపడుతుండడంతో వారు.. ముందు జాగ్రత్త చర్యగా రహదారులు మూసివేస్తున్నారు. బయటి వ్యక్తులెవరూ ఊర్లోకి రాకూడాదని బోర్డులు కూడా పెడుతున్నారు. logo