సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 20, 2020 , 11:54:02

ఆహ్లాదకరంగా పల్లె పార్క్ లు.. ఫలిస్తున్న ప్రభుత్వం కృషి

ఆహ్లాదకరంగా పల్లె పార్క్ లు.. ఫలిస్తున్న ప్రభుత్వం కృషి

సంగారెడ్డి :  ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రతి పల్లెలో ఏర్పాటు చేస్తున్న పార్క్ లు ఆహ్లాదకరంగా ఉంటున్నాయని పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియ అన్నారు. సోమవారం ఆయన సంగారెడ్డి జిల్లాలో పర్యటించారు.  పటాన్ చెరు మండలం కర్దనూర్ లో పల్లె ప్రకృతి పార్క్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలు పచ్చని చెట్లు, ఆహ్లదకర వాతావరణంలో విలసిల్లాలన్నారు. అనంతరం హరితహారంలో భాగంగా మొక్కను నాటి నీళ్లు పోశారు. కార్యక్రమంలో పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు, ప్రజా ప్రతినిధులు, అదికారులు పాల్గొన్నారు. 
logo