మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 09, 2020 , 15:54:57

రైతాంగాన్ని సంఘటితం చేసేందుకు వేదికలు : మంత్రి జగదీశ్‌రెడ్డి

రైతాంగాన్ని సంఘటితం చేసేందుకు వేదికలు : మంత్రి జగదీశ్‌రెడ్డి

సూర్యపేట : రైతాంగాన్ని సంఘటితం చేసేందుకే రైతు వేదికల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్టు రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. గురువారం తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తొండ, వర్ధమానుకోట గ్రామాల్లో రూ.22లక్షల అంచనాలతో నిర్మించతలపెట్టిన రైతు వేదికల నిర్మాణానికి మంత్రి జగదీశ్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అలాగే ఎమ్మెల్యే గాధారి కిశోర్ కుమార్‌తో కలిసి నాగారం మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాల ఆవరణలో ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరిగిన లబ్ధిదారులకు ఆస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియంత్రిత సాగుపై దృష్టి సారించాలని రైతాంగానికి పిలుపునిచ్చారు.

రైతును రాజును చేయడమే సీఎం కేసీఆర్‌ సంకల్పమని చెప్పారు. ఇందులో భాగంగా బడ్జెట్‌లో 50శాతం నిధులు వ్యవసాయ రంగానికే కేటాయించారని గుర్తు చేశారు. స్థానిక శాసనసభ్యులు గాధారి కిశోర్‌కుమార్ మాట్లాడుతూ కక్షలు కార్పణ్యాలతో తల్లడిల్లిన తుంగతుర్తి నియోజకవర్గంలో పాడి పంటలు సస్యశ్యామలంగా ఉన్నాయంటే అది సీఎం కేసీఆర్‌ చలవేనని కొనియాడారు. అలాగే మంత్రి జగదీశ్‌రెడ్డి చూపిన చొరవ ప్రధాన కారణమన్నారు. ఆయా కార్యక్రమాల్లో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్‌ చైర్మన్‌ రామకృష్ణారెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు ఎస్‌కే రజక్, జిల్లా వ్యవసాయాధికారి జ్యోతిర్మయి, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ శిరీష్‌ తదితరులు పాల్గొన్నారు.


logo