శనివారం 15 ఆగస్టు 2020
Telangana - Jul 15, 2020 , 17:29:09

రైతుల సంఘటితానికే వేదికలు : మంత్రి ఐకేరెడ్డి

రైతుల సంఘటితానికే వేదికలు : మంత్రి ఐకేరెడ్డి

నిర్మల్‌ : రైతుల సంఘటితానికే వేదికలు నిర్మిస్తున్నట్లు రాష్ట్ర అటవీ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. నర్సాపూర్ (జి) మండల కేంద్రంలోని కేజీబీవీ వద్ద రైతు వేదిక భవన నిర్మాణానికి బుధవారం మంత్రి భూమిపూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. ఇందులో భాగంగానే రైతుల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. దసరా వరకు రైతు వేదిక భవనాలను పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో నిజామాబాద్ జడ్పీ చైర్మన్ విఠల్‌రావు, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు వెంకట్ రాంరెడ్డి, నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొంగరి నర్మదాముత్యం రెడ్డి, నర్సాపూర్ జడ్పీటీసీ రామయ్య, ఎంపీపీ రేఖా, ఎంపీటీసీ మల్లేశ్‌, మండల కన్వీనర్ రాజేశ్వర్, సర్పంచ్ రాంరెడ్డి పాల్గొన్నారు. అలాగే మంత్రి సారంగాపూర్‌ మండలం బీరవెల్లి, దిలావపూర్‌ మండలం బన్సపెల్లి గ్రామాల్లో రైతు వేదికలకు భూమిపూజ చేసి, మొక్కలు నాటారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo