శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 27, 2020 , 01:56:38

బాలల హక్కుల పరిరక్షణ వేదిక

బాలల హక్కుల పరిరక్షణ వేదిక

  • రాష్ట్ర అధ్యక్షుడిగా వేణుగోపాల్‌

చాంద్రాయణగుట్ట, నమస్తే తెలంగాణ: చాంద్రాయణగుట్ట నియోజకవర్గానికి చెందిన గంజి వేణుగోపాల్‌ తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ వేదిక అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆదివారం నిర్వహించిన కమిషన్‌ సమావేశంలో వేణుగోపాల్‌ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తూ  జాతీయ కమిషన్‌ చైర్‌పర్సన్‌ శాంతసిన్హా నియామక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బాల ల హక్కుల జాతీయ కమిషన్‌ చైర్‌పర్సన్‌ శాంతసిన్హా, కన్వీనర్‌ వెంకట్‌రెడ్డి, కో-ఆర్డినేటర్‌ రాజేంద్రప్రసాద్‌ పాల్గొన్నారు. వేదిక అధ్యక్షుడిగా కొనసాగుతున్న పీ అచ్యుతరావు కరోనా వైరస్‌ బారినపడి ఇటీవల మృతిచెందిన విష యం తెలిసిందే.


logo