శనివారం 30 మే 2020
Telangana - May 10, 2020 , 21:39:05

రేపటి నుంచి గాంధీలో ప్లాస్మా థెరపీ

రేపటి నుంచి గాంధీలో ప్లాస్మా థెరపీ

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ను నియంత్రించడంలో కీలకంగా వ్యవహరించే ప్లాస్మా థెరపీని సోమవారం నుంచి గాంధీ  దవాఖానలో ప్రారంభించేందుకు  వైద్యులు సిద్ధమయ్యారు. ఇండియాన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌  రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) నేతృత్వంలో ఈ విధానం రోగులను స్వస్థపరుచడంలో ఎంత మాత్రం ఉపయోగపడుతుందో తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. సార్స్‌-కోవ్‌-2 పాజిటివ్‌ రోగులను గుర్తించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. కరోనా వైరస్‌ బారిన పడి చికిత్స పొంది డిశ్చార్జి అయి ప్లాస్మా ఇచ్చేందుకు ముందుకువచ్చిన దాదాపు 15 మంది కొవిడ్‌ వ్యాధిగ్రస్థులను దవాఖాన అధికారులు గుర్తించారు. వీరు దేశవ్యాప్త క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం తమ రక్తాన్ని ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తంచేసినట్లు తెలిసింది. ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల మేరకు కొవిడ్‌ నయమైన వారిని గుర్తించినట్లు  గాంధీ దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు తెలిపారు. ప్లాస్మా థెరపీ  చేపట్టేందుకు దేశవ్యాప్తంగా  28 టీచింగ్‌ హాస్పిటళ్లను ప్రభుత్వం గుర్తించింది. తెలంగాణలో గాంధీతోపాటు సనత్‌నగర్‌లోని ఈఎస్‌ఐసీ సూపర్‌ స్పెషాలిటీ దవాఖానలో కూడా ప్లాస్మా థెరపీ క్లినికల్‌ ట్రయల్స్‌ జరుపుతారు. 


logo