సోమవారం 13 జూలై 2020
Telangana - Apr 11, 2020 , 02:05:55

చివరిదశలో ప్లాస్మా థెరపీ

చివరిదశలో ప్లాస్మా థెరపీ

  • డీసీజీఐ ఆమోదం కోసం ఎదురుచూపు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కొవిడ్‌-19 బాధితుల చికిత్సలో కీలకంగా మారనున్న ప్లాస్మాథెరపీ ప్రక్రియ చివరిదశకు చేరుకొన్నది. వైరస్‌ బారినపడి కోలుకున్న వ్యక్తి రక్తంలోని ప్లాస్మాను కొవిడ్‌-19 రోగుల చికిత్సకు వినియోగిస్తారు. పలు దేశాలు క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించగా.. భారత్‌లో మొదట కేరళలో చేపట్టారు. హైదరాబాద్‌గాంధీ దవాఖానలో కూడా ట్రయల్స్‌ కొనసాగుతున్నాయి. కేరళలోని శ్రీచిత్ర తిరునల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మెడికల్‌ సైన్సెస్‌.. ప్లాస్మా థెరపీపై క్లినికల్‌ ట్రయల్స్‌ చేపట్టింది. దీనికి ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ ఆమోదం తెలిపింది. ఈ చికిత్స అమలుకు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) అనుమతి కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆ ప్రక్రియ కొనసాగుతున్నట్టు ఐసీఎమ్మార్‌ అధికారులు తెలిపారు. ప్లాస్మాథెరపీ ప్రొటోకాల్‌ రూపొందిస్తున్నామని, ఇది చివరి దశలో ఉన్నదని చెప్పారు. 


logo