e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 25, 2021
Home తెలంగాణ మొక్కవోని దీక్షతో..

మొక్కవోని దీక్షతో..

  • రాష్ట్రవ్యాప్తంగా జోరుగా ముక్కోటి వృక్షార్చన
  • ఉత్సాహంగా మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు
  • మంత్రి కేటీఆర్‌కు మొక్కనాటి శుభాకాంక్షలు
  • ఒకేరోజు రికార్డుస్థాయిలో నాటుకున్న 3.30 కోట్ల మొక్కలు

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ జన్మదినోత్సవాన తెలంగాణ హరిత శోభితమైంది. శనివారం ఒక్కరోజులోనే గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 3.30 కోట్ల మొక్కలు నాటి రికార్డు సృష్టించారు. టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలతోపాటు సామాన్య ప్రజలు, మేధావులు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు, ఉద్యోగులు ఉద్యమంలా కదిలి మొక్కలు నాటారు. ఆస్ట్రేలియా,కువైట్‌ వంటి దేశాల్లోనూ కేటీఆర్‌ జన్మదినోత్సవాన్ని నిర్వహించి మొక్కలు నాటారు. పేదలు, విద్యార్థులు, అవసరంలో ఉన్నవారికి పలువురు నేతలు వివిధ రూపాల్లో సహాయం అందించారు.

నేడు

ప్రస్తుతం దట్టమైన అడవిని తలపిస్తున్న జగిత్యాలలోని తారకరామ ప్రకృతి వనం.. దీనిని యాదాద్రి మోడల్‌లో అధికారులు అభివృద్ధిచేసి సుందరంగా తీర్చిదిద్దారు.

హరిత దండు కదిలింది

- Advertisement -

టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కే తారకరామారావు పుట్టినరోజు సందర్భంగా గ్రీన్‌ ఇండియా చాలెజ్‌ ఆధ్వర్యంలో ఎంపీ సంతోష్‌కుమార్‌ పిలుపు మేరకు ముక్కోటి వృక్షార్చనలో భాగంగా నల్లగొండ జిల్లా కేంద్రం ఎస్‌ఎల్‌బీసీలో కార్యకర్తలు, మున్సిపల్‌ సిబ్బందితో కలిసి మొక్కలు నాటుతున్న ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు తదితరులు

మొక్క కోసం అందరూ..

ముక్కోటి వృక్షార్చనలో భాగంగా శనివారం శాసనసభ ఆవరణలో మొక్కనాటి నీరు పోస్తున్న స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ప్రొటెం చైర్మన్‌ భూపాల్‌రెడ్డి. చిత్రంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

పచ్చనాకు సాక్షిగా..

హైదరాబాద్‌ కొండాపూర్‌లోని పాలపిట్ట సైక్లింగ్‌ పార్కులో మొక్కనాటి నీరు పోస్తున్న మంత్రి హరీశ్‌రావు. చిత్రంలో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి తదితరులు

మొక్కను నిలబెట్టుకుందాం

ఖమ్మంలోని టీఆర్‌ఎస్‌ కార్యాలయం ఆవరణంలో మొక్క నాటుతున్న రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తదితరులు

గిఫ్ట్‌ ఏ స్మైల్‌..

జనగామ జిల్లా పాలకుర్తిలో కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా గిఫ్ట్‌ ఏ స్మైల్‌లో భాగంగా దివ్యాంగులకు వాహనాలు పంపిణీ చేసి మాట్లాడుతున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

ఆదరిద్దాం.. ఆదుకుందాం

ఓయూ పాలకమండలి సభ్యుడు, ప్రైవేట్‌ డిగ్రీ, పీజీ కాలేజీల రాష్ట్ర అధ్యక్షుడు ఎస్వీసీ ప్రకాశ్‌ రూపొందించిన ‘గిఫ్ట్‌ ఏ కెరీర్‌’ పోస్టర్‌ను హైదరాబాద్‌లోని జాహ్నవి డిగ్రీ కాలేజీలో ఆవిష్కరిస్తున్న రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి

మొక్కకు మొక్కుదాం

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని భవితశ్రీ హాలిడే రిసార్ట్‌లో నిర్వహించిన మంత్రి కేటీఆర్‌ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డికి మొక్కను అందజేస్తున్న వరంగల్‌ మాజీ మేయర్‌ గుండా ప్రకాశ్‌

నాటు వేద్దాం.. నీరు పోద్దాం

మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా దూలపల్లి అటవీ ప్రాంతంలో మొక్క నాటి నీరు పోస్తున్న టీఆర్‌ఎస్‌ ఎన్నారై వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్‌ కూర్మాచలం. చిత్రంలో ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ తదితరులు


నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌లో బృహత్తర పలె ్లప్రకృతి వనంలో మొక్క నాటి నీళ్లు పోస్తున్న ఆర్‌అండబీశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
మహబూబ్‌నగర్‌ సమీపంలోని కేసీఆర్‌ ఎకో అర్బన్‌ పార్కులో మొక్క నాటి నీళ్లు పోస్తున్న పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు

వనపర్తి జిల్లా చందాపూర్‌ సమీపంలోని అటవీ ప్రాంతంలో మొక్క నాటి నీరు పోస్తున్న వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

చేయిచేయి కలుపుదాం

మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా రాజ్యసభసభ్యుడు సంతోష్‌కుమార్‌ పిలుపుమేరకు కోటి వృక్షార్చనలో భాగంగా బహ్రెన్‌లో మొక్క నాటుతున్న తెలంగాణవాసులు

ఆత్మీయుల అన్నదానం

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరంలో అన్నదానం నిర్వహిస్తున్న అభిమానులు

చిన్నారులకు తీపి..

వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ నియోజకవర్గం దౌల్తాబాద్‌ మండలంలోమంత్రి కేటీఆర్‌ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా కేక్‌ కట్‌చేసి చిన్నారికి తినిపిస్తున్న మంత్రి సబితారెడ్డి. చిత్రంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి తదితరులు

దివ్యాంగులకు చిరునవ్వులు

సూర్యాపేటలోని క్యాంపు కార్యాలయంలో దివ్యాంగులకు త్రి చక్రవాహనాలు అందజేస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి. చిత్రంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌ మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ కనకదుర్గకాలనీలో మొక్క నాటుతున్న దివ్యాంగుల చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మెడపట్ల సతీశ్‌

రామన్నకు హ్యాపీ బర్త్‌డే..

హైదరాబాద్‌ బాలానగర్‌లో మొక్క నాటుతున్న మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌. చిత్రంలో ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్లు రవీందర్‌రెడ్డి, సతీశ్‌గౌడ్‌, టీజీవో అధ్యక్షురాలు మమత

రేపటి మాను..

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలోని తాళ్లగడ్డలో మొక్క నాటుతున్న మండలి మాజీ చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్‌రావు తదితరులు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana