గ్రీన్‌చాలెంజ్‌లో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి
హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): పచ్చదనాన్ని పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం తన పుట్టినరోజు సందర్భంగా ఎంపీ సంతోష్‌కుమార్ పిలుపుమేరకు గ్రీన్ చాలెంజ్‌లో భాగంగా ప్రభాకర్‌రెడ్డి మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మొక్కలు నాటడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని చెప్పారు. తన నియోజకవర్గ ప్రజలంతా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినందుకు ఎంపీ సంతోష్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.