బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 11, 2020 , 01:31:46

హరిత తెలంగాణ కోసం మొక్కల దత్తత

హరిత తెలంగాణ కోసం మొక్కల దత్తత
  • టీఎస్‌ఎఫ్‌డీసీ వినూత్న ప్రయోగం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మొక్కలను సంరక్షించేందుకు తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎఫ్‌డీసీ) ‘మొక్కలదత్తత’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బొటానికల్‌ గార్డెన్‌లోని పాలపిట్ట పార్కులో ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. దాతలు రూ. 5 వేలు చెల్లించి ఒక మొక్కను దత్తతను తీసుకుంటే మొక్క బతికున్నంతవరకు వారిపేర్లున్న బోర్డులను మొక్కలపై ఉంచుతామని టీఎస్‌ఎఫ్‌డీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, పీసీసీఎఫ్‌ రఘవీర్‌ తెలిపారు. ఎక్కువ మొక్కలను దత్తత తీసుకొనేవారికి రుసుములో రాయితీ ఇస్తామని వెల్లడించారు. పాలపిట్టపార్కులో రెండొందల మొక్కలను దత్తత తీసుకొనేందుకు కెనరాబ్యాంక్‌ ముందుకొచ్చింది. ఇందుకోసం ఐదు లక్షల రూపాయలు చెల్లించింది. 


logo