ఆదివారం 31 మే 2020
Telangana - May 18, 2020 , 18:31:44

హైదరాబాద్‌ మురుగునీటి వ్యవస్థ బలోపేతానికి ప్రణాళికలు

హైదరాబాద్‌ మురుగునీటి వ్యవస్థ బలోపేతానికి ప్రణాళికలు

హైదరాబాద్‌: ఖైరతాబాద్‌ జలమండలి ప్రధాన కార్యాలయంలో మంత్రి కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. నగరంలో మురుగునీటి కాలువల వ్యవస్థ, ఎస్టీపీల నిర్మాణంపై  పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, జలమండలి ఎండీ దానకిశోర్‌, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు. సేవరేజ్‌ వ్యవస్థ, ఎస్టీపీలపై మంత్రి కేటీఆర్‌కు అధికారులు  వివరించారు. హైదరాబాద్‌ లో సేవరేజ్‌ వ్యవస్థను బలోపేతం చేయాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు.

నగరంలోని మురుగునీటిని శుద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు  మంత్రి కేటీఆర్ నిర్దేశించారు. నూతన ఎస్టీపీల కోసం స్థలం అన్వేషించకుండా ఇప్పటికే ఉన్న ఎస్టీపీల ప్రాంతంలోనే నూతన ఎస్టీపీల నిర్మాణానికి సాధ్యాసాధ్యాలు పరిశీలించాలన్నారు. కూకట్‌ పల్లి నాలాపై వర్టికల్‌ ఎస్టీపీ నిర్మాణానికి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఎస్టీపీల నిర్మాణానికి ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యం అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఎఫ్‌ఎస్టీపీల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని అధికారులకు నిర్దేశించినట్లు మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. 

ప్రస్తుతం 25 ఎస్టీపీల ద్వారా 772 ఎంఎల్‌డీల మురుగునీరు శుద్ధి చేస్తున్నమని జలమండలి ఎండీ దానకిశోర్‌ తెలిపారు. నగరంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం మురుగునీటిని శుద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నమని పేర్కొన్నారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo