శుక్రవారం 10 జూలై 2020
Telangana - Jun 06, 2020 , 03:32:00

ఆబ్కారీశాఖ @ 45 లక్షల మొక్కలు

ఆబ్కారీశాఖ @ 45 లక్షల మొక్కలు

  • అధికారులకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆదేశం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణకు హరితహారంలో భాగంగా ఈ ఏడాది ఆబ్కారీశాఖ ఆధ్వర్యంలో 45 లక్షల ఈత, తాటి మొక్కలను నాటేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అధికారులను ఆదేశించారు. ఇందులో స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ఎక్సైజ్‌శాఖపై సమీక్ష నిర్వహించారు. మహిళా ఉద్యోగులను వేధిస్తున్నారని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ మీద వచ్చిన ఆరోపణలపై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. వైన్స్‌లలో రాత్రి 8.30 గంటలవరకు అమ్మకాలు జరిపేందుకు అనుమతిచ్చినట్టు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్‌ అజయ్‌రావు, డిప్యూటీ కమిషనర్లు ఖురేషి, కేఏబీ శాస్త్రి, సహాయ కమిషనర్‌ హరికిషన్‌, ఈసీలు దత్తరాజుగౌడ్‌, చంద్రయ్య, ప్రదీప్‌రావు, గణేశ్‌గౌడ్‌, రఘురాం, జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు.


logo