శనివారం 04 జూలై 2020
Telangana - May 27, 2020 , 18:26:28

వానకాలం పంటలకు ప్రణాళికలు రెడీ : మంత్రి జగదీష్ రెడ్డి

వానకాలం పంటలకు ప్రణాళికలు రెడీ : మంత్రి జగదీష్ రెడ్డి

నల్గొండ : కందులకున్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని జిల్లాలో కంది సాగుపై దృష్టి సారించాలని విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అధికారులకు సూచించారు. కందిపంటకు మద్దతు ధర అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నందున రైతులలో ఆ దిశగా చైతన్య పర్చాలని ఆయన కోరారు. నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నియంత్రిత సాగుపై జరిగిన సమీక్ష సమావేశానికి ఆయన ముఖ్య అతిథి గా హాజరయ్యారు. రైతులను సంఘటిత పరచాలి అన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అని అటువంటప్పుడే పండించిన పంటకు ధర నిర్ణయించుకునే శక్తి రైతుకు లభిస్తుందని ఆయన తేల్చి చెప్పారు. ప్రయోగాత్మకంగా మొదలు పెట్టిన నియంత్రిత సాగు అంతిమంగా రైతుకు లబ్ది చేకూర్చలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం అని ఆయన అన్నారు. రైతు బంధు తగ్గింపు అన్నది శుష్క ప్రచారం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. 2019 లో ఈ పథకం కింద 42,5355 మంది రైతులకు గాను 591.96 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికే 3,8,1769 మంది రైతుల ఖాతాల్లో రూ. 485.59 కోట్లు జమ అయ్యాయి అన్నారు.

అయితే ఇకపై రైతు విధిగా వ్యవసాయ శాఖ అధికారి వద్ద తాను ఏ పంట వేస్తున్నాడు అన్నది నమోదు చేసుకోవాలి అని సూచించారు. నమోదు అయి కూడా రైతుబందు పథకం అందక పోతే అధికారులు బాధ్యత వహించాలిసి ఉంటుందన్నారు. వానాకాలం పంటలకు విత్తనాలు ఎరువులు సిద్దంగా ఉన్నాయన్నారు. జిల్లాలో సాగుకు అనువైన 10 లక్షల 67 వేల318 ఎకరాల్లో వెయ్యనున్న పంటలకు సరిపడా 91,791 క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులోకి తెచ్చామన్నారు. అదే విదంగా కంది పంట ను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం 2,019 కి ప్రస్తుతానికి ఏకంగా 50%శాతానికి పెంచింది. అంటే కిందటి సంవత్సరం జిల్లాలో 14351 ఎకరాల కే పరిమితం అయిన కందిని 30 వేల ఎకరాలకు పెంచడం తో పాటు అందుకు సరిపడా 1200 క్వింటాళ్ల విత్తనాలను ఆయా ప్రాంతాలకు చేర వేసినట్లు మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, నోముల నర్సింహాయ్య యాదవ్ ,యన్.భాస్కర్ రావు, చిరుమర్తి లింగయ్య, గాదరి కిశోర్ కుమార్ జిల్లా కలెక్టర్ సంగీత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


logo