శనివారం 04 జూలై 2020
Telangana - Jun 04, 2020 , 16:39:10

విత్తనాల సరఫరాకు పక్కా ప్రణాళిక

విత్తనాల సరఫరాకు పక్కా ప్రణాళిక

హైదరాబాద్‌: వానాకాలం సాగుకు విత్తనాల సరఫరాపై రెడ్‌ హిల్స్‌ ఉద్యాన శిక్షణా కేంద్రంలో జరిగిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి ఆద్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్‌ రెడ్డి, విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వర్‌ రావు, విత్తనాభివృద్ధి సంస్థ డైరెక్టర్‌ కేశవులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ విత్తనాల సరఫరా చురుగ్గా జరగాలని అధికారులను ఆదేశించారు. వానపడితే రైతులు ఆగే పరిస్థితి ఉండదన్నారు. నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలని ఈ సందర్బంగా మంత్రి సూచించారు.  

అందుబాటులో సరిపడా విత్తనాలు ఉన్నాయని, విత్తనాలు ఎక్కడెక్కడ అందుబాటులో పెట్టింది క్లస్టర్ల వారీగా ప్రతి రోజూ వివరాలు నమోదు చేయాలని అధికారులకు సూచించారు మంత్రి. ప్రధానమైన విత్తన కంపెనీలతో ప్రతి రోజూ సమాచారం సేకరించాలని,  సన్నాలలో తెలంగాణ సోన సాగును ప్రోత్సహించాలని సూచించారు. మధుమేహం రోగులకు తెలంగాణ సోన మేలుచేస్తుందన్నారు. అందుకే ప్రభుత్వం తెలంగాణ సోన సాగును ప్రోత్సహిస్తుందన్నారు. దీనిని భారీగా సాగుచేసేలా రైతులను చైతన్యం చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. ఈ వానకాలంలో 4 లక్షల క్వింటాళ్ల విత్తనాల ఉత్పత్తికి తెలంగాణ విత్తనాభివృద్ది సంస్థ సన్నాహాలు చేస్తుందన్నారు మంత్రి. 


logo