సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 09, 2020 , 18:38:27

మహారాష్ట్ర వెదురు క్షేత్రాన్ని సందర్శించిన రాష్ట్ర నేతలు

మహారాష్ట్ర వెదురు క్షేత్రాన్ని సందర్శించిన రాష్ట్ర నేతలు

మహారాష్ట్ర: రాష్ట్రంలోని సింధ్‌ దుర్గ్‌ జిల్లా కుడాల్‌ తాలూకా శివారులో ఉన్న వెదురు పరిశ్రమ, క్షేత్రాలను ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ బి. వినోద్‌కుమార్‌ సందర్శించారు. వెదురు నిపుణుల బృందంతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. వెదురు సాగు విజయగాథను వినోద్‌కుమార్‌ వెంట రాష్ర్టానికి చెందిన బృందం స్వయంగా పరిశీలించారు. వెదురు సాగు, దానికి అవసరమైన నేలలు, సాంకేతిక పరిజ్ఞానం వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. వినోద్‌కుమార్‌ వెంట మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ నియోజకవర్గం ఇన్‌ఛార్జీ మర్రి రాజశేఖర్‌రెడ్డి, రాష్ట్ర హార్టీకల్చర్‌ కమిషనర్‌ ఎల్‌ వెంకట్‌రామ్‌రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా(అస్కి) డైరెక్టర్‌ అచీలేందర్‌రెడ్డి, ఎన్నైరై శ్రీనివాస్‌గోగినేని, కెనడా దేశపు వెదురు నిపుణులు సుదీర్‌ కోదాటి, కృష్ణ కోమండ్ల, తదితరులు ఉన్నారు. 


logo