శనివారం 30 మే 2020
Telangana - May 03, 2020 , 20:19:27

కరోనా పోయిందని ఎవరూ అనుకోవద్దు

కరోనా పోయిందని ఎవరూ అనుకోవద్దు

హైదరాబాద్‌: వలస కార్మికులకు ఉపాధి ఏర్పాట్లు చేస్తున్నామని  రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్  తెలిపారు. నిర్మాణరంగం, పరిశ్రమలు ప్రారంభమైతే తెలంగాణలోనే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. 'సొంతూళ్లకు వెళ్తామన్న కూలీలను వారంలోపు పంపిస్తాం. తెలంగాణలో సుమారు వేల సంఖ్యలో వలస కూలీలు ఉన్నారు. కరోనా పోయిందని ఎవరూ అనుకోవద్దు..ఎప్పుడైనా తిరగబెట్టవచ్చు.  ప్రస్తుతం సోషల్‌ డిస్టెన్సే కరోనాకు వ్యాక్సిన్‌. తెలంగాణలో వలస కార్మికులకు అన్ని విధాలా ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. వలస కార్మికుల కోసం కొన్ని పరిశ్రమలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని' వినోద్‌ కుమార్‌ చెప్పారు. 


logo