శనివారం 29 ఫిబ్రవరి 2020
పందుల పోటీలు.. ఆసక్తిగా తిలకించిన భక్తులు

పందుల పోటీలు.. ఆసక్తిగా తిలకించిన భక్తులు

Feb 15, 2020 , 08:52:44
PRINT
పందుల పోటీలు.. ఆసక్తిగా తిలకించిన భక్తులు

జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలో జరుగుతున్న తిక్కవీరేశ్వరస్వామి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం మార్కెట్‌ సబ్‌ యార్డు ఆవరణలో ఎరుకలి సంఘం ఆధ్వర్యంలో పందుల పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ర్టాల నుంచి 10 జతల పందులను తీసుకొచ్చారు. ఈ పోటీలను భక్తులు ఆసక్తిగా తిలకించారు. 

మొదటి బహుమతి అయిజకు చెందిన వైఎం శివ పంది కైవసం చేసుకోగా, రెండో బహుమతి అయిజకు చెందిన అంజి పంది, మూడో బహుమతి తాడిపత్రికి చెందిన గంగన్న పంది గెలుపొందినట్లు నిర్వాహకులు తెలిపారు. పోటీలలో గెలుపొందిన పందుల యజమానులకు  మొదటి బహుమతి కింద రూ. 50,016, రెండో బహుమతి రూ. 20.016, మూడో బహుమతి 10.016లను అందజేశారు. 

- అయిజ logo